– కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పునరుత్పాదక ఇంధన రంగంలో రాణిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సౌర పంపుసెట్లను భారీగా కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రికి మూడు ప్రత్యేక వినతులు అందజేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకారం అందించాలని కోరారు. కుసుం-ఎ పథకం కింద రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తోందని భట్టి తెలిపారు. ముందే నిర్ణయించిన విధంగా పీఎం కుసుం కంపోనెంట్- ఎ కింద 500 కేడబ్ల్యూ నుంచి 2 ఎండబ్ల్యూల సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయరంగానికి సాగునీటి కల్పనకు శాశ్వత పరిష్కారంగా సౌర పంపుసెట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రం భావిస్తోందని, ఈ నేపథ్యంలో పీఎం కుసుం కంపో నెంట్-బి కింద లక్ష సౌర పంపు సెట్లను స్థాపించాలని కోరి నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధిం చిన డీపీఆర్‌ను టీఎస్‌ఆర్‌ఈడీసీవో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. రాష్ట్ర వాటా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్రమంత్రికి వివరించామన్నారు. గిరిజనుల సాగు భూముల్లో విద్యుత్ లైన్ల స్థాపనకు అటవీ చట్టాలు ఆటంకంగా ఉన్నందున, ఈ దిశగా కేంద్రం సహకరించాలని కోరినట్టు చెప్పారు. పీఎం కుసుం కంపోనెంట్-సి కింద తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల పంపుసెట్లను కేటాయించాలని కోరినట్టు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 28 వ్యవసాయరంగ సాగునీటి అవసరాల కోసం లక్షల పంపు సెట్లు వినియోగంలో ఉన్నందున సాంప్రదాయ విద్యుత్ రంగంపై భారాన్ని నివారించేందుకు వీటి అవసరాన్ని కేంద్రమంత్రికి వివరించినట్టు ఆయన పేర్కొన్నారు.
సౌర పంపుసెట్లు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES