Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..30 మందికి గాయాలు..డ్రైవర్ పరిస్థితి విషమం

కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..30 మందికి గాయాలు..డ్రైవర్ పరిస్థితి విషమం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుపతి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలో బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని తక్షణమే తిరుపతి రుయా ఆస్ప‌త్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad