నవతెలంగాణ-హైదరాబాద్: హనీమూన్‌కు మేఘాలయ తీసుకెళ్లి భర్తను చంపించిన కేసు ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) 790 పేజీల ఛార్జిషీట్‌ను సోహ్రా సబ్-డివిజన్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సమర్పించింది. ఈ మేరకు మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మతుడి భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా సహా ఐదుగురు నిందితులపై పోలీసులు అభియోగాలు మోపారు.
యూపీకి చెందిన సోనమ్ రఘువంశీ-ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి మే 11, 2025న వివాహం జరిగింది. వివాహం అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న జంట అదశ్యమయ్యారంటూ కలకలం రేపింది. మేఘాలయ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జూన్ 2న కొండల్లో రాజా మతదేహం లభించింది. రాజా హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఇక సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఏదో జరిగిందని దర్యాప్తు కొనసాగిస్తుండగా జూన్ 8న యూపీలో సోనమ్ ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురి సాయంతో భర్తను చంపేనట్లుగా సోనమ్ తెలిపింది. దీంతో యావత్తు దేశమంతా ఉలిక్కిపాటుకు గురైంది. అనంతరం నిందితులను జైలుకు తరలించారు.