పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలి

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతరెడ్డి అన్నారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని  పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలు, అబ్బాండెడ్ వాహనాలను పరిశీలించి త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5ఎస్ ఇంప్లిమెంటేషన్ పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా చేదించాలని ఎస్ఐలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ ఏర్రల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love