Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeనిజామాబాద్ ఆశా వర్కర్లక ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

 ఆశా వర్కర్లక ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

- Advertisement -

మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ 
నవతెలంగాణ-కంఠేశ్వర్ 
ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి అని, ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని, కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల కు ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశ వర్కర్ల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000/-లు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా (ది. 09-10-2023న) హైదరాబాద్, కోఠి కమీషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించాం. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చారు.ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చింది. 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న, డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమీషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా, చర్చల సందర్భంగా కమీషనర్ గారు స్పందిస్తూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఇతర సమస్యల పైన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారు ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు ఆశ వర్కర్లు ఫిక్స్డ్ 18,000 వేలు వేతనం ఇవ్వాలని పని భారం తగ్గించాలని టార్గెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణుక, సుకన్య, శోభ, సిహెచ్ నర్సా, రేణుక, రాధా, శైలజ, గంగామణి విజయ కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad