నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రం లో జాసనే ఈద్ మీలాద్ ఉన్నబి సల్లెల్లా అలైహి వ సల్లం జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జులుసే మొహమ్మదియా జామియా మసీద్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీ మీదుగా ర్యాలీగా వెళ్లారు. కత్తిజ మజీద్ హజరత్ బండేగి పాషా దర్గా వద్ద ప్రార్ధన చేసినారు. తిరిగి మళ్లీ జామ్యా మజీద్ కు వెళ్లడం జరిగింది. ఆదే విదంగా జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ను షాల్వతో సన్మానం ముస్లిం మత పెద్దలు చేసారు. అనంతరం పండు పలహారాలు అన్నదాన కార్యక్రమం ముస్లిం సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు అబ్దుల్ సుభాన్ సహాబ్ మాట్లాడుతూ .. మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఆయన ఎలాగైతే ప్రజలుకు చెప్పిన ప్రవచనాల ప్రకారం అందరిలో సమానత్వం, సౌబ్రాహుత్వం, అనాధ పిల్లలను ఆదుకోవాలని సూచించారు. తల్లి, తండ్రిని గౌరవించడం వలన జన్మ సర్దమం అని అన్నారు.
ప్రతి సంవత్సరం రబి ఆల్ అవ్వల్ నెల లో 12వా తేది రోజున జరుపుకుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఏ రాజా కమిటీ అధ్యక్షు ఎస్ డి. షకేల్ మస్జిద్ ఇమామ్ అబ్దుల్ సుభాన్ సహాబ్ జామా మసీద్ ఇమామ్ నిజాముద్దీన్ ఆఫీస్ షేక్ పీర్దోస్, మహమ్మద్ ఫారూక్ ఎస్డీ కరీం, ఖాజా కాసిం మైబూబ్, మొహ్మద్ రఫిక్, ఇలియాస్, సమీర్, గ్రామ పేదలు ముస్లిం యువకులు తదితతరులు పల్గొన్నారు.