- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర ఎమ్మెల్సీ ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
- Advertisement -