నవతెలంగాణ-హైదరాబాద్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఓ యువకుడు అదృశమైయ్యాడు. మండలంలోని నోముల గ్రామానికి చెందిన కేశవరపు శశిధర్..సోమవారం ఇంటి నుంచి బయటి వెళ్లి..తిరిగి రాలేదని స్థానిక పీఎస్ లో యువకుని తల్లి ఫిర్యాదు చేసింది. సదురు యువకుడు.. నకిరేకల్ విద్యుత్ సంస్థలో ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన బిల్ రీడర్ గా 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజువారిగానే విధులు ముగించుకొని ఇంటికి వచ్చే వాడని చెప్పారు. కానీ సోమవారం ఉదయం ఏడున్నరకు విధులకు వెళ్తున్నాని చెప్పి..మళ్లీ తిరిగి రాలేదని, ఫోన్ చేసినా స్వీచ్ ఆప్ వస్తుందని, దగ్గర బంధువులలో తమ కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీశామని యువకుని తల్లి కేశవరపు అనసూర్య ఫిర్యాదులో పేర్కొంది.
