Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంథాయిలాండ్‌ మాజీ ప్రధానికి భారీ షాక్

థాయిలాండ్‌ మాజీ ప్రధానికి భారీ షాక్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: థాయిలాండ్‌ మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్రాను ఏడాది జైలు శిక్షను పూర్తి చేయాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయన దాటవేసిన జైలు శిక్షను అనుభవించాలని కోర్టు ఆదేశించింది. తక్సిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారని స్థానిక మీడియా తెలిపింది. రెండు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఆధిపత్యం వహించిన రాజకీయ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బకానుంది.

2006లో సైనిక తిరుగుబాటు కారణంగా థాయిలాండ్‌ మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్ర పదవి నుండి వైదొలిగారు. 2008లో రాజకీయ ప్రేరేపిత ఆరోపణలపై ఆయనకు జైలు శిక్ష విధించడంతో తక్సిన్‌ దేశం నుండి పారిపోయారు. 15 ఏళ్ల స్వీయ ప్రవాసం నుండి 2023లో తక్సిన్ స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత గతంలో నమోదైన కేసులో సుప్రీంకోర్టు 8 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తక్సిన్‌ గుండె, ఛాతీ నొప్పులతో ఆస్పత్రికి తరలించడానికి ముందు కొన్ని గంటలు మాత్రమే జైలులో ఉన్నారు. ఇది రాజకీయ వివాదానికి, ప్రజల ఆగ్రహానికి దారితీసింది. అయితే తక్సిన్‌ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షను ఏడాదికి తగ్గిస్తూ థాయిలాండ్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల తర్వాత తక్సిన్‌ పెరోల్‌పై విడుదలయ్యారు. ఆతర్వాత ఆయన ఆస్పత్రిలోని విఐపి విభాగంలోనే ఉన్నారు. అప్పటి శిక్షను పూర్తిగా అనుభవించాల్సిందేనని సుప్రీంకోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది.

11 రోజుల క్రితం తక్సిన్‌ షినవత్రా కుమార్తె పెటోంగ్‌టార్న్‌ షినవత్రాను కోర్టు ప్రధాని పదవి నుండి తొలగించిన సంగతి తెలిసిందే. షినవత్రా కుటుంబం నుండి కోర్టు లేదా సైన్యం తొలగించిన ఆరవ ప్రధాని తక్సిన్‌ కానున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad