- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మద్య మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాలు కొదురుపాక, వరదవెల్లి, నిరోజుపల్లి గ్రామాల నిర్వాసితుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం తెలిపారు. బోయిన్పల్లి మండలం కొదురుపాక, వరదవెల్లి, నిరోజుపల్లి గ్రామాల నిర్వాసితులు ఎవరైతే ఆర్ & ఆర్ పట్టా ధ్రువీకరణ పత్రం పొంది ఉన్నారో వారు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో తేదీ 10 సెప్టెంబర్ 202, 11 సెప్టెంబర్ 2025 రెండు రోజులలో గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
- Advertisement -