Thursday, May 8, 2025
Homeహైదరాబాద్అల్లూరికి 'వంద'నం

అల్లూరికి ‘వంద’నం

- Advertisement -

అన్యాయంపై తొలి తిరుగుబాటు

నవతెలంగాణ హైదరాబాద్: “తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా…. మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా”.. మన్యం వీరుడికి నివాళిగా మహాకవి  శ్రీశ్రీ పట్టిన అక్షర నీరాజనం అని రంగస్థల నిపుణులు కె. శాంతారావు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. ఒక పాతికేళ్ల కుర్రాడు పెద్దగా చదువుకోలేదు కీర్తి కాంక్ష పొందాలన్న ఆశ లేదు డబ్బు సంపాదించాలన్న కనీస కోరిక లేదు కానీ.. కళ్ళముందే ఆంగ్లేయుల అక్రమాలు జరుగుతుంటే..దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసోపేతమైన పోరాటం అల్లూరి సీతారామరాజు నమ్మిన లక్ష్యం కోసం ఆంగ్లేయులపై నిప్పులు కురిపించిన యోధుడతడు దేశం కోసం అసువులు బాసి మే ఏడుకు అంటే నేటి కి నూరేళ్లు పూర్తి అవుతున్నా ఈ సందర్భంగా విప్లవాగ్నికి “వంద”నాలతో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం టీపీఎస్కే ఘనంగా నివాళులు అర్పించింది . అల్లూరి సీతారామరాజు దేశభక్తి అజరామరం అసమాన ప్రతిభా పాటవాల పోరాట వ్యూహాలకు ప్రతీక బ్రిటిష్ వాళ్ళ ప్రలోభాలకు లొంగని ధీరోదాత్తుడు పదవులకు హోదాలకు లొంగని ప్రజల కష్టానికి తప్ప మరి దేనికి కరగని అల్లూరి సీతారామరాజు పైన ఆంగ్లేయులు అక్కసుతో తుపాకులతో కాల్చి చంపారని నన్ను కాల్చి చంపితే.. వందమంది అల్లూరి లు పుడుతారని నీ పాలన ను అంత మెందిస్తారని ఆనాడే హెచ్చరించారని అన్నారు అల్లూరిని చంపమని ఆంగ్లేయులు సంబరపడ్డారు కానీ ఈనాటికీ ప్రశ్నించే గళాలలో.. అన్యాయం పై సంధించి పిడికిల్లలో శ్రీరామరాజు బతికే ఉన్నారని అది బాలల్లో బాల అల్లూరి ల వేషంలో మనకు కనపడుతున్నారని అన్నారు

అల్లూరి సీతారామరాజు వేషాలలో బాలలంత వారి ఆశయాలను బుజాలకెత్తుకుంటాం దేశభక్తిని చాటుతాం అంటూ ప్రతిజ్ఞ చేశారు ఇండియన్ అకాడమీ హైస్కూల్ రుత్విక్, భవ్వనుషు అల్లూరి వేషధారణలు చూసి నప్పుడు అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాడా..? అన్నట్లు గా ఏకపాత్రాభినయాలు అభినయించారు పలువురిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సిటీ కమిటీ కన్వీనర్ జి.నరేష్ , కవి పొన్నం రాజయ్యగౌడ్ కవయిత్రి రుపా రుక్మిణి,పద్మ, మహేష్ దుర్గే సమ్మర్ క్యాంప్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -