- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అక్టోబర్ 2న విడుదలయ్యే ‘కాంతార: చాప్టర్-1’ సినిమాతో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలోకి రానుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ ఈనెల 12న విడుదలవుతోంది.
- Advertisement -