నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ కుమార్(22) గ్రేటర్ నోయిడాలో ఎంబీఏ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని భగవాన్ టాకీస్ ప్రాంతానికి చెందిన దేవాంశ్ పీజీడీఎం ప్రోగ్రాంలో చేరాడు. ఇద్దరు కలిసి ఓ వసతి గృహంలో ఉంటున్నారు. మంగళవారం వారుంటున్న గది నుంచి రోదనలు వినిపిస్తుండటంతో సెక్యూరిటీ గార్డ్ వార్డెన్‌కు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూడగా.. ఇద్దరు విద్యార్థులు రక్తపుమడుగులో పడి ఉన్నారు. దీపక్ తలకు తూటా గాయం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. దేవాంశ్ తలపై గాయంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లైసెన్స్ ఉన్న రివాల్వర్, నాలుగు తూటాలు, రెండు కాల్చిన తూటాలు, మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దేవాంశ్ తుపాకీతో దీపక్‌కుమార్‌ను కాల్చి, తర్వాత తాను కాల్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
దీపక్ కుమార్ మృతితో తల్లిదండ్రులు దివ్వెల వెంకటరత్నం(మాజీ కౌన్సిలర్), నీరజ శోకసంద్రంలో మునిగారు. వీరికి దీపక్ ఏకైక కుమారుడు. కవలలైన హర్షిత, వర్షిత ఉన్నారు.
ఢిల్లీలో ఏపీ విద్యార్థి హత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES