- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- Advertisement -