Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రి నర్సింగ్ ఆఫీసర్లు

ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రి నర్సింగ్ ఆఫీసర్లు

- Advertisement -

– అన్ని విభాగాల ఉద్యోగులను 2025- 26 రెన్యువల్  చేయాలని విజ్ఞప్తి
– 6 నెలల పెండింగ్ వేతనం చెల్లించాలి
 నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
: నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న టిమ్స్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్  నర్సింగ్ ఆఫీసర్లకు ఆరు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని నర్సింగ్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బుధవారం కోఠి లో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమను జీఓ నెం. 920  కింద  కోవిడ్  సమయంలో టిమ్స్ ఆస్పత్రిలో పనిచేయుటకు 2019 లో  కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ నర్సింగ్ ఆఫీసర్లు(156) పారామెడికల్, అన్ని విభాగాలకు చెందిన వారిని ఔట్ సోర్సింగ్ లో (77) పనిచేయుటకు  ఉద్యోగాల్లోకి తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ అనంతరం టీమ్స్ ఆస్పత్రికి చెందిన నర్సింగ్ ఆఫీసర్లు పారామెడికల్ సిబ్బంది అందర్నీ డిప్యూటేషన్ పై డి ఎం ఈ పరిధిలోని ఆసుపత్రులు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిలోఫర్ మెటర్నిటీ ఆసుపత్రి, సరోజిని, కోఠి ఈ ఎన్  టి ఆసుపత్రిలో తమను చేర్చుకున్నారని తెలిపారు. కొంతకాలం జీతం వెంట వెంటనే ఇచ్చారని తెలిపారు. గత ఆరు నెలలుగా తమను రెన్యువల్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలలుగా వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక కుటుంబం గడవక అనేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పరిత్యమయ్యారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డి ఎం ఈ ఇప్పటికైనా స్పందించి తమ ఉద్యోగాలను 2025 -26 రెన్యువల్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad