Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుదళితబాలికపై లైంగిక‌దాడి..

దళితబాలికపై లైంగిక‌దాడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : న‌ల్ల‌గొండ జిల్లా కనగల్ మండలం షాబుల్లాపురం గ్రామంలో దారుణమైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దళితబాలికపై లైంగిక‌దాడి జ‌రిగింది. గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూడడానికి వచ్చిన మైనర్ బాలికపై కన్నేసిన సుఖేందర్ అనే వ్య‌క్తి ఫోన్ నెంబర్ చూపిస్తూ తనకి ఫోన్ చేయాలని సైగలు చేశాడు. బాలిక నిరాకరించడంతో త‌న నోరును మూసి పక్కనే ఉన్న బాత్రూంలో తీసుకెళ్లి లైంగిక‌దాడి చేశాడు. బాలిక ఆరుపుల‌తో గ‌మ‌నించిన బాలిక త‌ల్లిద‌డ్రులు ప‌రిగెత్తుకుని రాగా నిందితుడి వెంట వచ్చిన మన్నెం రాంబాబు, సోమ చందు స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఆ స‌మ‌యంలో నిందితుడు సుఖేందర్ తప్పించుకొని పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కనగల్ పోలీసులకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు సుఖేందర్ పై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad