- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఇస్లాంనగర్‌లో అజార్ డానిష్, ఢిల్లీలో అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ఆయుధాలు, బుల్లెట్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకుంది. వీరిద్దరూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. సెంట్రల్ ఏజెన్సీస్, ఝార్ఖండ్ ఏటీఎస్‌తో కలిసి రైడ్స్ చేసి వారిని పట్టుకుంది.
- Advertisement -