నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో జెన్-జెడ్ ఉద్యమకారులు సృష్టించిన మారణహోమం ఒక్కొక్కటిగా తాజాగా వెలుగులోకి వస్తున్నారు. విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా ఇంట్లోకి చొరబడి జెన్ జెడ్ నిరసనకారులు నానా బీభత్సం సృష్టించారు. భౌతికదాడులతో అర్జు రాణా దేవుబా బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇక మాజీ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాపై కూడా ఒక గుంపు దాడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాపై సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాపై కాదు.. అవినీతిపై నిషేధం విధించండి అంటూ జెన్ జెడ్ ఉద్యమం చెలరేగింది. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లులు లక్ష్యంగా దాడులు జరిగాయి. దీంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, మంత్రులు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్మీ పరిపాలనను చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కొనసాగిస్తోంది.