Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీనటుడు అభిషేక్‌ బచ్చన్‌

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీనటుడు అభిషేక్‌ బచ్చన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బాలీవుడ్‌ సినీనటుడు అభిషేక్‌ బచ్చన్‌ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. కొన్ని వెబ్‌ సైట్‌లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని, వాటిని ఉపయోగించుకోవడానికి కూడా వీలులేకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కొందరు వ్యక్తులు ఏఐ తో అభిషేక్‌ ఫొటోలు క్రియేట్‌ చేసి అశ్లీల కంటెంట్‌కు ఉపయోగించుకుంటున్నట్లు నటుడి తరఫు న్యాయవాది ప్రవీణ్‌ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. ఇక సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఏఐ ఫొటోలు, వీడియోలు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారాయి. తాజాగా ఇదే విషయంపై అభిషేక్‌ భార్య సినీనటి ఐశ్వర్యారాయ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించుకోవడానికి వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సంస్థలు, వ్యక్తులు ఐశ్వర్య పేరు, ఫొటోలు ఉపయోగించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad