5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్రలో రాని నిజ జీవితాల కథనాలతో రూపొందిన చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’.
జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే సినిమాని ఈనెల 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకరటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సిధిన్ మాట్లాడుతూ, ‘ఇక్కడ సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. ‘గేమ్ ఆఫ్ చేంజ్’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం వంటిది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన కొన్ని నిజ జీవితాల కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’ అన్నారు. ‘2018లో ‘ఇంటర్నెట్ లైఫ్ స్టైల్‌హబ్’ ప్రారంభించి, ఇప్పటివరకు 30 వేల మందికి డిజిటల్ కోచింగ్ ఇచ్చాను. నేను ఇంగ్లీష్‌లో రాసిన ‘యు కెన్ కోచ్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగాయి. సినిమా రంగంపై ఉన్న మక్కువతో నిర్మాతగా, నటుడిగా ఈ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాను’ అని నిర్మాత సిద్ధార్థ్ రాజశేఖర్ అన్నారు.
మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ, ‘ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేసాం. సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘చావా’ సినిమా మాదిరిగా మా చిత్ర కథ కూడా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.
బ్లెర్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయ శేఖర్, దినాజ్ వేర్వాట్వాల, ఆదిత్య, సోనియా శర్మ, గీతా మిక్కిలినేని, హరీష్, ప్రియాదావే, కుషాల్ కులకర్ణి, దేవినా రావు, విశాల్ సైని, డాక్టర్ ప్రభాకర్ రాజు, వినీత సిద్ధార్థ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
నిజ జీవిత కథనాల ఆధారంగా..
- Advertisement -
- Advertisement -