Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సాయుధ పోరాట చిహ్నం వీరనారి ఐలమ్మ 

సాయుధ పోరాట చిహ్నం వీరనారి ఐలమ్మ 

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్
నవతెలంగాణ – బల్మూరు 

సాయుధ పోరాట చిహ్నం చాకలి ఐలమ్మ అని వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మార్చితే చెరిగిపోదని అన్నారు. బుధవారం మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం ప్రపంచంలో ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో దొరలు, జాగిర్దారులు, పటేల్ పట్వారిలు, నైజాం రజాకారు యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి జరిపిన మహోన్నత పోరాటమని మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ అన్నారు.

బల్మూరు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ 40వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ..ఈ పోరాటం దోపిడీ, పీడనలను,వెట్టి చాకిరిని నిర్మూలించడమే కాకుండా ప్రజలకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు సుమారు 4000 మంది రక్త తర్పణతో లక్షలాధి ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిందన్నారు. విసునూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి దుర్మార్గులను తరిమికొట్టిన చరిత్ర సాయుధ రైతాంగ పోరాటమన్నారు ఆ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు మాత్రమేనని పోరాట చరిత్రను గుర్తు చేశారు.

 కమ్యూనిస్టుల నాయకత్వాన 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు సాధించిపెట్టిందనారు ఈ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు. భూ పంపిణీ ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని సాధించి పెట్టిందన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని అందించిందన్నారు 1946 లోనే మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చి మహిళల్ని కథనరంగంలో కార్యోన్ముఖులను చేసి వారిని నాయకత్వ స్థానంలోకి తీసుకువచ్చిందన్నారు . మల్లు స్వరాజ్యం,ఆరుట్ల కమలాదేవి  లాంటి వీరనారులను తయారు చేసిందన్నారు. పేదలకు, ముఖ్యంగా మహిళలకు విద్యను అందించే విషయంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో వయోజన విద్యాను ప్రారంభించి లక్షలాది గ్రామాల్లో  చదువు చెప్పిందన్నారు. ఈ పోరాటం ద్వారా అనేకమంది కవులు కళాకారులు ముందుకు వచ్చారని బండి యాదగిరి, సుద్దాల హనుమంతు,సి నారాయణరెడ్డి,కాలోజి నారాయణరావు లాంటివారు అనేకమంది సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. 

 ఘనమైన చరిత్ర కలిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింలు గొడవగా వక్రీకరణ చేయాలని భావిస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ లకు ఈ పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమితే చరిత్ర హీనులవుతారని అన్నారు 4000 మంది కమ్యూనిస్టు యోధుల బలిదానమే వీరోచిత సాయిధర రైతాంగ పోరాటమని గుర్తు చేశారు. 

సాయుధ పోరాట చరిత్ర స్ఫూర్తితో నాడు జాగీర్దారులు,పటేల్,పట్వారిలకు, రజాకార్ మూకలకు వ్యతిరేకంగా పోరాడినట్లే నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాదంపై పోరాడాలని మత చిచ్చు రేపి తమ పబ్బము గడుపుకోవాలని చూస్తున్న మతోన్మాదముకలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల వారమవుతామని, మతోన్మాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు లాల్ మమ్మద్ ఆంజనేయులు లక్ష్మణ్ రవి అన్వర్ రాము చిట్టి తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad