Thursday, May 8, 2025
Homeసినిమానవ్వించడమే లక్ష్యం

నవ్వించడమే లక్ష్యం

- Advertisement -

‘మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొత్త కథ, స్క్రీన్‌ ప్లే ఉంటుంది. బ్యూటీిఫుల్‌ లవ్‌ స్టోరీ. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ కొత్తగా ఉంటాయి’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘#సింగిల్‌’. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషించారు. కార్తీక్‌ రాజు దర్శ కత్వం వహించారు. గీతా ఆర్ట్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ,’ఇందులో అన్ని సన్నివేశాలు మనల్ని మనం రిలేట్‌ చేసుకునేలా ఉంటాయి. యంగ్‌స్టర్స్‌ అందరికీ చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్‌ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మేము అనుకున్నది స్క్రీన్‌ మీదకి చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ పాటలకి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్‌ అవుతుందనిపించింది. ముఖ్యంగా నా క్యారెక్టర్‌, వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్‌. ఇద్దరు హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌ని ఆడియన్స్‌ చాలా ఎంజారు చేస్తారు. క్లైమాక్స్‌ చాలా యూనిక్‌గా ఉంటుంది. ప్రస్తుతం ‘మత్యుంజయ’ థ్రిల్లర్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు, ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా చేస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -