– దక్షిణాఫ్రికాపై 23పరుగుల తేడాతో గెలుపు
కొలంబో: ముక్కోణపు సిరీస్ ఫైనల్లోకి భారత మహిళలజట్టు దూసుకెళ్లింది. ప్రేమదాస స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళలతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 23 పరుగుల తేడాతో గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. జెమీమా రోడ్రిగెజ్ (123) శతకానికి తోడు స్మృతి మంధాన(51), దీప్తి శర్మ (93) అర్ధసెంచరీలతో రాణించారు. దీప్తి సెంచరీకి 7 పరుగుల దూరంలో సెంచరీని కోల్పోయింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మహిళలు చివరి వరకు వీరోచితంగా పోరాడింది. అన్నెరీ డెర్క్‌సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్(67) సౌతాఫ్రికాను గెలుపు తీరాలకు చేర్చినా.. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్‌కు మూడు, దీప్తి శర్మకు రెండు, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా మహిళలు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 11న కొలంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. మే 9న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.
స్కోర్‌బోర్డు…
భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతికా రావల్ (సి)డెర్క్‌సన్ (బి)క్లార్క్ 1, మంధాన (సి)డి-క్లార్క్ (బి)ట్రైయాన్ 51, హర్లిన్ డియెల్ (బి)క్లాస్ 4, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి)షాంగసే (బి)డెర్క్‌సన్ 28, రోడ్రిగ్స్ (సి)లూస్ (బి)క్లాస్ 123, దీప్తి శర్మ (సి)ట్రయాన్ (బి)క్లార్క్ 93, రీచా ఘోష్ (సి)బ్రిట్స్ (బి)మాబా 20, అమన్‌జ్యోత్ కౌర్ (సి)స్మిట్ (బి)మాబా 5, శ్రీచరాణి (రనౌట్) ట్రయాన్ / డి-క్లార్క్ 6, స్నేహ్‌రాణా (నాటౌట్) 1, అదనం 5. (50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 337పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/18, 3/50, 4/138, 5/260, 6/296, 7/314, 8/336, 9/337
బౌలింగ్: క్లాస్ 8-0-51-2, క్లార్క్ 9-0-54-2, డెర్కెసన్ 6-0-36-1, మాబా 8-0-71-2, షాంగసె 6-0-43-0, ట్రైయాన్ 8-0-46-1, లూస్ 3-0-15-0, మానే స్మిట్ 2-0-20-0
ఫైనల్‌కు హర్మన్‌ప్రీత్ సేన
- Advertisement -
- Advertisement -