Thursday, May 8, 2025
Homeరాష్ట్రీయంతాటిచెట్టుపై నుంచి పడి..

తాటిచెట్టుపై నుంచి పడి..

- Advertisement -

– కల్లుగీత కార్మికుడు మృతి
నవతెలంగాణ -కూసుమంచి

తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరిశాబోయిన లక్ష్మయ్య(55) రోజు మాదిరిగానే బుధవారం ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -