నవతెలంగాణ-హైదరాబాద్: కామ్రేడ్ సీతారాం ఏచూరి భవన్ ను (విశాఖపట్నం జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయం) గురువారం ఉదయం విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీ ప్రాంతంలో సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్టతగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హాజరు కాగా అతిధులుగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి పద్మ, సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బి గంగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్బంగా ప్రజాశక్తి దినపత్రిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.
విశాఖలో సీతారాం ఏచూరి భవన్ ను ప్రారంభించిన ఎంఏ బేబీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES