Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంపుప్పాలగూడలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

పుప్పాలగూడలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

- Advertisement -

– కొరియోగ్రాఫర్‌ కోరేటి రవీందర్‌రెడ్డి మృతి
నవతెలంగాణ-గండిపేట్‌

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ శ్రీనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొరియో గ్రాఫర్‌ కోరేటి రవీందర్‌రెడ్డి (38) మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరెటి రవీందర్‌రెడ్డి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆయన అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు 301లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి అతని గదిలోని ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి. షార్ట్‌ సర్య్కూట్‌ తో ఆ మంటలు వ్యాపించి, పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. గమనిం చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నార్సింగి పోలీసులు ప్రమాదం చోటుకి చేరుకుని రవీందర్‌రెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అప్పటికే ఆయన మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య విజయ, పిల్లలు మౌతిక, నిశాంత్‌రెడ్డి ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -