Thursday, September 11, 2025
E-PAPER
Homeజిల్లాలుహైద‌రాబాద్ శివారులో భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ శివారులో భారీ వ‌ర్షం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లో ఉద‌యం నుంచి మేఘ‌ల‌తో బ‌రువెక్కిన వాతావ‌ర‌ణం.. సాయంత్రం న‌గ‌రంలో ఒక్క‌సారిగా భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ర‌హ‌దారుల‌న్నీ కూడా వ‌ర‌ద నీటితో చెరువుల‌ను త‌ల‌పించాయి. అదేవిధంగా న‌గ‌ర శివార్ల‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్, పెద్దఅంబ‌ర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలో ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వ‌ర్షం కురిసింది.

ఇక ఎల్‌బీన‌గ‌ర్‌, భాగ్య‌ల‌త‌, వ‌న‌స్థ‌లిపురం ఏరియాల్లోనూ వాన దంచికొట్టింది. ఈ భారీ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవేపై మోకాళ్ల లోతు వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలో వాహ‌నాలు నెమ్మెదిగా క‌దులుతున్నాయి. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -