Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంసైనిక దళాల వెంటే ప్రజలు

సైనిక దళాల వెంటే ప్రజలు

- Advertisement -

– దేశ సమగ్రత, శాంతి సామరస్యతకు కలిసి నడుస్తాం : ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
– అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-షాద్‌నగర్‌ రూరల్‌, కొత్తూరు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా యుద్ధ పోరాటం చేస్తున్న భారత సైనిక దళాల వెంట రాష్ట్ర, దేశ ప్రజలంతా ఉన్నారని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో బుధవారం కలిసి మంత్రి కొత్తూరు, నంది గామ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నందిగామ మండలంలోని చాకలి దానిగుట్ట తండాలో బస్టాండ్‌, చలి వేంద్రాన్ని ప్రారంభించారు. నాట్కో పరిశ్రమ సీఎస్‌ఆర్‌ నిధులతో చాకలిదానిగుట్టతండా, సంఘీగూడ, నందిగామలో అంగన్‌వాడీ భవనాలతోపాటు కొత్తూరు మండల కేంద్రంలో రూ.3కోట్లతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. దేశ సమగ్రత, శాంతి సామ రస్యం విషయంలో భారత సైనిక దళాలు ప్రాణాన్ని లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారని కొని యాడారు. ఇది దేశ ప్రజలకు ఎంతో గర్వకారణమని చెప్పారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన భారత సైనిక దళాల పరాక్రమానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. దేశంలో రాజకీయాల పరంగా, సిద్ధాంతాల పరంగా వేరైనా దేశ సమగ్రతను శాంతి సామరస్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్‌ ముం దుంటుందని అన్నారు. తమ నేత రాహుల్‌ గాంధీ భారత ప్రభుత్వానికి మద్దతు పలికారని తెలిపారు. విద్య, వైద్యానికి నాట్కో పరిశ్రమ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. త్వరలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తామన్నారు.
చేయి చాచలేదు.. తలదించలేదు.. : ఎమ్మెల్యే వీర్లపల్లి
నాట్కో పరిశ్రమ నిర్మించిన ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏ పరిశ్రమ వద్ద నేను ఎప్పుడూ చేయి చాచలేదు.. తలదించలేదు’ అని ఎమ్మెల్యే తన తల్లిపై ప్రమాణం చేసి మరీ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాట్కో డైరెక్టర్‌ పిఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, వైస్‌ చైర్మెన్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ డోలి రవీందర్‌, డీఈఓ సుసింధర్‌రావు, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో అరుంధతి, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -