నవతెలంగాణ-హైదరాబాద్: ఓట్ చోరీ గురించి త్వరలో ‘అణుబాంబు లాంటి ఆధారాలు’ వెల్లడిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. బిజెపి ఓట్ చోరీకి పాల్పడుతుందని పునరుద్ఘాటించారు. ఓట్ చోరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలను వెల్లడించానని, భవిష్యత్తులో ‘ హైడ్రోజన్ బాంబ్ వంటి ఆధారాలు (ఎక్స్‌ప్లోజివ్ ప్రూఫ్)’ బయటపెడతానని అన్నారు.
తన నియోజకవర్గం రారుబరేలీలో రెండు రోజుల పర్యటన కోసం రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్ చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిషా) సమావేశానికి అధ్యక్షత వహించారు. కలెక్టరేట్‌లోని బచత్ భవన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) గురించి మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక మరియు హర్యానాలో ఎన్నికలు దోచుకోబడ్డాయి. అధికారికంగా మరియు వ్రాతపూర్వకంగా నమోదు చేయబడిన సాక్ష్యాలను సమర్పించానని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంచలన, ఎక్సిప్లోజివ్ ప్రూఫ్ వెల్లడించనున్నామని అన్నారు. ఓట్ చోర్, గడ్డిచోర్ అనే నినాదం దేశవ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. రాష్ట్రాల్లో ఓట్లు దొంగిలించబడి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్నది వాస్తవమని, వాటికి మీకు రుజువు ఇస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు. హైడ్రోజన్ బాంబు పేలినపుడు, మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బిజెపి నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు.