– రెండు వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలుపు
– నైట్‌రైడర్స్ ప్లే-ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టం
కోల్‌కతా: ప్లే-ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తడబడ్డారు. ఆ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రెండు వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలై.. డిఫెండింగ్ ఛాంపియన్ ప్లే-ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకోగా.. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. అనంతరం చెన్నై 19.4ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై జట్టులో బ్రెవీస్(52) అర్ధసెంచరీకి తోడు దూబే(45), ధోనీ(17నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. కోల్‌కతా బౌలర్లు వైభవ్ అరోరాకు మూడు, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాకు రెండేసి వికెట్లు దక్కాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కెకెఆర్ ఇన్నింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్(11) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన సునీల్ నరైన్ (26, 17బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్) దూకుడుగా ఆడినా, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(1) కూడా నిరాశపరిచాడు. ఒక దశలో 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను కెప్టెన్ రహానే ఆదుకున్నాడు. అతనికి ఆండ్రీ రస్సెల్ (38, 21 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీష్ పాండే (36 నాటౌట్, 28 బంతుల్లో; ఫోర్, సిక్సర్) తోడవడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. రహానే అర్ధశతకానికి చేరువలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో రింకూ సింగ్ (9) వేగంగా ఆడే ప్రయత్నంలో నూర్ అహ్మద్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రమణ్‌దీప్ సింగ్ (4 నాటౌట్) అజేయంగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంభోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.
స్కోర్‌బోర్డు…
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి)నూర్ అహ్మద్ (బి)కంబోజ్ 11, నరైన్ (స్టంప్)ధోనీ (బి)నూర్ అహ్మద్ 26, రహానే (సి)కాన్వే (బి)జడేజా 48, రఘువంశీ (సి)ధోనీ (బి)నూర్ అహ్మద్ 1, మనీష్ పాండే (నాటౌట్) 36, రస్సెల్ (సి)బ్రెవీస్ (బి)నూర్ అహ్మద్ 38, రింకు సింగ్ (సి)ఆయుష్ మాత్రే (బి)నూర్ అహ్మద్ 9, రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 4, అదనం 6. (20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 179పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/69, 3/71, 4/103, 5/149, 6/167
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 2-0-14-0, కంబోజ్ 3-0-38-1, అశ్విన్ 3-0-19-0, నూర్ అహ్మద్ 4-0-31-4, జడేజా 4-0-34-1, పథీరణ 4-0-39-0.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: ఆయుష్ మాత్రే (సి)హర్షీత్ రాణా (బి)వైభవ్ అరోరా 0, కాన్వే (బి)మొయిన్ 0, వుర్విల్ పటేల్ (సి)వరణ్ చక్రవర్తి (బి)హర్షీత్ రాణా 31, అశ్విన్ (సి)రఘువంశీ (బి)హర్షిత్ రాణా 8, జడేజా (సి)వరుణ్ చక్రర్తి 19, బ్రెవీస్ (సి)రింకు సింగ్ (బి)వరణ్ చక్రవర్తి 52, దూబే (సి)రింకు సింగ్ (బి)వైభవ్ అరోరా 45, ధోనీ (నాటౌట్) 17, నూర్ అహ్మద్ (సి)రింకు సింగ్ (బి)వైభవ్ అరోరా 2, కంబోజ్ (నాటౌట్) 4, అదనం 5. (19.4ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 183పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/25, 3/37, 4/56, 5/60, 6/127, 7/170, 8/172
బౌలింగ్: వైభవ్ అరోరా 3-0-46-2, మొయిన్ అలీ 2-0-23-1, హర్షీత్ రాణా 4-0-43-2, వరణ్ చక్రవర్తి 4-0-18-2, సునీల్ నరైన్ 4-0-28-0, ఆండీ రస్సెల్ 2.4-0-22-0.
చెన్నైకు ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES