Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీకి భారీ షాక్.. 43 మంది నేతల రాజీనామా

బీజేపీకి భారీ షాక్.. 43 మంది నేతల రాజీనామా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 43 మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు గురువారం మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఘటన ఉఖ్రుల్ జిల్లాలోని ఫుంగ్యార్ నియోజకవర్గంలో జరిగింది.

పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని రాజీనామా చేసిన నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్గత సంప్రదింపులు, కలుపుగోలుతనం లోపించాయని, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని వారు ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారిలో ఫుంగ్యార్ మండల అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్ మోర్చాల అధ్యక్షులు, పలువురు బూత్ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -