నవతెలంగాణ-హైదరాబాద్: ఖతార్ రాజధాని దోహలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ దాడుల్ని ఆపాలని అమెరికాతో సహా ఐక్యరాజ్యసమితి కౌన్సిల్‌లోని 15 మంది సభ్యులు పిలుపునిచ్చారు. ఈమేరకు వారు గురువారం ప్రకటనను విడుదల చేశారు. అలాగే ఖతార్‌కి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.
కాగా, ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో ఐదుగురు హమాస్ సభ్యులు మృతి చెందారని పాలస్తీనియన్ గ్రూప్ వెల్లడించింది. అయితే హమాస్ నేతలు చనిపోలేదని తెలిపింది. అయితే ఈ దాడిలో ఖతార్ భద్రతా దళ సభ్యుడు మరణించాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఖతార్ దాడిపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, తీవ్రంగా ఇజ్రాయిల్‌ని మందలించినట్లు కనిపించింది. ఖతార్‌పై దాడిని అమెరికా తాత్కాలిక రాయబారి డోరతీ షియా వ్యతిరేకించారు.
దోహపై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన UNO
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES