Friday, September 12, 2025
E-PAPER
Homeజిల్లాలురాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

- Advertisement -




* సెక్యూలరిజాన్ని కాపాడాలి

* రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం

* ఏచూరి మృతి దేశప్రజలకు, సీపీఐ(ఎం) పార్టీకి తీరనిలోటు

* సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు

నవతెలంగాణ సంగారెడ్డి :

భారత రాజ్యాగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ లో సీపీఐ(ఎం) మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా చుక్క రాములు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లు అర్పించారు. ఈ సందర్భంగా ‘మతోన్మాదదాడులు-రాజ్యాంగం-సెక్యూలరిజం` ఆవశ్యకత అనే అంశంపై సెమినార్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి భారతదేశ ప్రజలకు, సీపీఐ(ఎం) పార్టీకి తీరనిలోటన్నారు. తాను చదువుకుంటున్న రోజుల్లోనే దేశంలో కొందరి చేతుల్లోనే సంపద పొగవడం, ప్రజలు, శ్రామికవర్గం ఇబ్బందులు పడుతున్న విధానాలను చూసి అందరికి సమాన అవకాశాలు కావాలని పోరాటం చేశాడన్నారు.

జేఎన్టీయూ (ఢిల్లీ) యూనివర్శిటీలో చదువుతూ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడన్నారు. అటు తరువాత మతోన్మాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సీతారాం ఏచూరిదన్నారు. భారతదేశం సెక్యూలర్ దేశం వివిధ మతాలు, కులాలు, భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు శ్రామికవర్గం కృషి చేయాలని సూచించారు. ప్రజాసామ్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రజల హక్కులు, విధులు, 18 సంవత్సరాలు నిండినవారందరికి ఓటు హక్కు కల్పించారన్నారు.

ప్రజలు తమకు ఇష్టమైన నాయకులను, ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం కల్పించారన్నారు. కానీ నేడు దేశంలో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారుతున్నారని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏండ్లు అయ్యిందని, ఈ పాలనలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తే గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులకు ఆమోదం తెలుపకుండా రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఏక్ భారత్ -శ్రేస్ట్ భారత్ అనే నినాదాన్ని తీసుకువస్తుందని, ఇది మంచిదే అయినా బీజేపీ నరేంద్రమోడీ సిద్దాంతం మాత్రం అందుకు భిన్నంగా ఒకే

దేశం, ఒకే భాష అనే నినాదంగా ఉందన్నారు. దీని వల్ల భిన్న మతాలు, భిన్న సంస్కృతుల, సెక్యూలర్ దేశంలో ఒకే మతం ఏ విధంగా ఉంటుందన్నారు.

భిన్నత్వంలో ఏకత్వానికి విరుద్ధ అంశమన్నారు. కేంద్రం నిర్ణయాల వల్ల రాష్ట్రాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తు కేంద్రం పరిపాలిస్తుందని, గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం బీహార్ లో 5 లక్షల ఓట్లను తొలగించిందని, వారి పార్టీ లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేందుకు అవసరమైతే ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమీషన్లను ఉపయోగిస్తుందన్నారు. ఓట్ల తొలగింపుపై సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికల కమీషన్ తప్పు జరిగిందని ఒప్పుకుందన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని కాపాడుకునేందుకు శ్రామికవర్గం ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.

ప్రస్తుతం మెజార్టీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తి పాలన నడుస్తుందన్నారు. దేశాన్ని రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ రక్షణకు అందరు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ సెమినార్ లో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, ఎం. మానిక్యం, జిల్లా కమిటీ సభ్యులు రేవంత్, నాయకులు ఎం.యాదగిరి, బాగారెడ్డి, రాజయ్య, వివిధ ప్రజాసంఘాల నాయకులు, వివిధ కంపెనీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -