నవతెలంగాణ – హైదరాబాద్: ప్రయివేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రెండు వేర్వేరు భద్రతాపరమైన సంఘటనలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఓ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో దాని టైరు ఊడి కిందపడిపోగా, గురువారం మరో విమానం ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్‌జెట్ క్యూ400 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని వెలుపలి టైరు ఒకటి ఊడి రన్‌వేపై పడిపోయింది. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించారు. అయినప్పటికీ, విమానం తన ప్రయాణాన్ని కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యాక సొంతంగా టెర్మినల్‌కు చేరుకుందని, ప్రయాణికులందరూ మామూలుగానే కిందకు దిగారని ఆయన వివరించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.