Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ ఎమ్మెల్యేకు రెండో అరెస్ట్‌ వారెంట్‌ జారీ

బీజేపీ ఎమ్మెల్యేకు రెండో అరెస్ట్‌ వారెంట్‌ జారీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌పై అహ్మదాబాద్‌ కోర్టు రెండో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. తొలి అరెస్ట్‌ వారెంట్‌కు ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్‌ 29న తొలి అరెస్ట్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. సెప్టెంబర్ 10న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయినప్పటికీ హార్దిక్‌ పటేల్‌ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో సెక్షన్ 70 కింద కోర్టు రెండో వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంటుందని సీనియర్‌ న్యాయవాది తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -