Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవాళికి నష్టమే : కేసీఆర్‌

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవాళికి నష్టమే : కేసీఆర్‌

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి భారతీయుడిగా గర్వపడుతున్నానని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత టెర్రరిజాన్ని అణచడానికి చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా… ఏ దేశంలో ఉన్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు. ఉగ్ర వాదాన్ని అంతమొం దించే క్రమంలో ప్రపంచ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే శాంతి సాధ్యమవుతుం దని అభిప్రాయపడ్డారు. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశరక్షణకు పాటుపడాలని ఆకాక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -