– కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్తాన్‌కు గట్టి జవాబిచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాత్రికిరాత్రి మన సైనికులు చరిత్ర స ృష్టించారని కొనియాడారు. అలాగే సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారినే మట్టుపెట్టాం. దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించం. భారత్ లక్ష్యం పాక్ కాదు.. ఉగ్రవాదులు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సైనికులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సరిహద్దు రాష్ట్రాల విషయంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నాం” అని మంత్రి వెల్లడించారు.
సైనికులు చరిత్ర సృష్టించారు
- Advertisement -
- Advertisement -