Friday, May 9, 2025
Homeజాతీయంరాష్ట్రపతితో మోడీ భేటీ

రాష్ట్రపతితో మోడీ భేటీ

- Advertisement -

– ప్రధాని యూరప్‌ పర్యటన వాయిదా
– నేడు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ:
ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావే శమయ్యారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత నౌకాదళం జరిపిన దాడుల గురించి ఆమెకు వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ తన యూరప్‌ పర్య టనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు పాకిస్తాన్‌, నేపాల్‌ దేశాల పొరుగున ఉన్న రాష్ట్రాల ముఖ్య మంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యద ర్శులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు, అధికారులు హాజ రయ్యారు. పాకిస్తాన్‌లో కానీ, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో కానీ పౌరులు, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. భారత దళాలు కచ్చితత్వంతో, జాగరూకత తో, మానవత్వంతో వ్యవహరించా యని ఆయన కొనియాడారు.
ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్షాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ తరఫున పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -