Friday, May 9, 2025
Homeజాతీయంపాక్‌పై ఒత్తిడి కొనసాగించాలి

పాక్‌పై ఒత్తిడి కొనసాగించాలి

- Advertisement -

– కేంద్రానికి సీపీఐ (ఎం) సూచన
న్యూఢిల్లీ:
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకుల ఊచకోతకు బాధ్యులైన వారిని అప్పగించేలా, తన భూభాగం నుండి ఎలాంటి ఉగ్రవాద శిబిరాలను నిర్వహించకుండా పాకిస్తాన్‌పై ఒత్తిడి కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ (ఎం) సూచించింది. ప్రజల ఐక్యత, దేశ సమగ్రతను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత దళాలు జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌పై సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ ఉన్న ఉగ్రవాద శిబిరాలను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే లక్ష్యంతో భారత సాయుధ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించాయి. సాయుధ దళాల సమాచారం ప్రకారం తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడులు జరిగాయి. అవి తీవ్రమైనవి కావు. నిర్దిష్ట లక్ష్యాల పైనే దాడులు చేశారు. పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఉగ్రవాదులను, వారిని నడిపించే వారిని లక్ష్యంగా చేసుకొని కేంద్రం చేపట్టే చర్యలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ చర్యలతో పాటు ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఒత్తిడిని కూడా పెంచాల్సి ఉంది. పహల్గాంలో అమాయక ప్రజల ఊచకోతకు కారకులైన వారిని అప్పగించాలని, తన భూభాగం నుండి ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు కార్యకలాపాలు సాగించకుండా చూడాలని పాకిస్తాన ్‌పై ఒత్తిడిని కొనసాగించాలి’ అని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -