- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. ఈక్వేటార్ ప్రావిన్స్‌కు 150 కి.మీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి. గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు. 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు.
- Advertisement -