Thursday, May 8, 2025
Homeరాష్ట్రీయంబదిలీలపై నిషేధం ఎత్తివేయాలి

బదిలీలపై నిషేధం ఎత్తివేయాలి

- Advertisement -

– మంత్రి దామోదర రాజనర్సింహకు టీజీజీడీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజీజీడీఏ) కోరింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ బి.నరహరి, సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌.లాలు ప్రసాద్‌ రాథోడ్‌, రాష్ట్ర కోశాధికారి డాక్టర్‌ మహ్మద్‌ ఖాజా రవూఫుద్దీన్‌ తదితరులు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, గాంధీ మెడికల్‌ కాలేజ్‌, కాకతీయ మెడికల్‌ కాలేజ్‌, నిజామాబాద్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల్లోని వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. సీనియర్‌ బోధనా సిబ్బంది కొరత కారణంగా వైద్య విద్య (పీజీ బోధన)తో పాటు రోగుల సేవలపై ప్రభావం పడుతున్నదని వారు తెలిపారు. ఇప్పటికీ మంజూరైన పలు పోస్టులు ఇంకా భర్తీ కాకుండా మిగిలిపోయాయని చెప్పారు. అదే సమయంలో పెరిఫెరియల్‌ మెడికల్‌ కాలేజీల్లో అర్హత కలిగిన వారు బదిలీపై ఆసక్తితో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఖాళీలకు బదిలీలను అనుమతించడం ద్వారా ప్రభుత్వంపై అదనంగా ఆర్థికభారం పడకుండా సిబ్బంది పెరుగుతుందని సూచించారు. ఈ బదిలీలతో ఆయా మెడికల్‌ కాలేజీలు బలోపేతం కావడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ సేవలు మరింత మెరుగవుతాయని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -