న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించింది. 2024 మే 25న రెండేండ్ల కాలానికి సూద్ సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు సభ్యులుగా వున్న సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలక్షన్ కమిటీ సిఫారసుల మేరకు క్యాబినెట్ అప్పాయింట్‌మెంట్స్ కమిటీ (ఏసీసీ) సూద్ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు ఆమోద ముద్ర వేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన సూద్ కర్ణాటక కేడర్‌కు చెందినవారు. కర్నాటక డీజీపీగా చేస్తూ సీబీఐ డైరెక్టర్‌గా వచ్చారు. 22ఏండ్ల వయస్సులో ఐపీఎస్‌లో చేరిన సూద్ ఐఐటీ ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.