Saturday, September 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలునకిరేకల్ ‘జిల్లా పరిషత్’లో కీచ‌క టీచ‌ర్

నకిరేకల్ ‘జిల్లా పరిషత్’లో కీచ‌క టీచ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు.కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. తాజాగా పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ జిల్లా పరిషత్ స్కూల్‌లో జరిగింది. ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీను తనను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. మూడు నెలలుగా వేధిస్తున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో తల్లిదండ్రులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి విద్యార్థిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడి వేధింపుల విషయం చెప్పింది. ఉదయం ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లిన పేరెంట్స్ ఘర్షణకు దిగారు. నిందితుడిని చితకబాదిన బాదారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -