– వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజరు
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థల్లో ఒకటైన టెక్స్ అకాడమీ సికింద్రాబాద్లో మెగా జాబ్ మేళా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది బ్రాంచుల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 22 కంపెనీలు, 45 మంది రిక్రూటర్లు ఐటీ, బీఎఫ్ఎస్ఐ, డిజిటల్ మార్కెటింగ్, మెడికల్ కోడింగ్, ఆటోసీఏడీ, బీఐఎం వంటి 30 విభాగాల్లో అవకాశాలు అందించారు. ఆన్-ది-స్పాట్ ఇంటర్వ్యూలు, ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఇచ్చారు. నిపుణులచే కెరీర్ కౌన్సెలింగ్, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 520 పైగా విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌లు లభించాయి.
ఈ సందర్భంగా టెక్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ షేక్ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమకు తగ్గ నైపుణ్యం అందించి ప్రముఖ రిక్రూటర్లతో కలపడమే లక్ష్యమన్నారు. ఈ జాబ్ మేళా వివిధ రంగాల్లో కెరీర్‌ను అభివృద్ధి చేయడంలో మరో ముందడుగుగా చెప్పవచ్చన్నారు. టెక్స్ అకాడమీ 14 ఏళ్లలో 4 రాష్ట్రాల్లో 8 శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. 240 పైగా నిపుణులైన శిక్షకులతో 50 పైగా అధునాతన కోర్సులను అందిస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో విశ్వసనీయమైన ఎడ్యుకేషన్ బ్రాండ్లలో ఒకటిగా (2024) గుర్తింపు పొందిన ఈ అకాడమీ, 50,000 పైగా నిపుణులకు శిక్షణ ఇచ్చిందన్నారు. 85 శాతం విజయాన్ని నమోదు చేసిందన్నారు. మా సంస్థకు టాప్ 10 డేటా సైన్స్ ఇన్‌స్టిట్యూట్లు – 2023 (సిలికాన్ ఇండియా), బెస్ట్ ఎమర్జింగ్ ట్రైనింగ్ అకాడమీ – 2023 (బ్రాండ్స్ ఇంపాక్ట్), మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషన్ బ్రాండ్ – 2024, ఇండియన్ ఐకానిక్ స్కిల్ & కెరీర్ ఎంపవరింగ్ ఇన్‌స్టిట్యూట్ – 2025 అవార్డులు వచ్చాయన్నారు. రిక్రూటింగ్ భాగస్వాములుగా పెట్రోకాన్ ఇంజినీర్లు, క్యామెల్ క్యూ సాఫ్ట్‌వేర్, జెనెసిస్ ఇన్ఫో ఎక్స్, సువిధా సాఫ్ట్‌వేర్, కపిల్ ఐటీ, సాఫ్ట్‌పాల్, igebra.ai, అభిరాం ఐటీ సొల్యూషన్స్ తదితర కంపెనీలు కలవన్నారు.