న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లోని 21 విమానాశ్రయాలను ఈ నెల 9 వరకూ మూసివేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 రాత్రి 11:59 గంటల వరకూ వీటిని మూసివేయాలని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని జమ్ము, శ్రీనగర్, లేV్‌ాలోని విమానాశ్రయాలు, పంజా బ్‌లోని అమృత్‌సగర్, చండీగఢ్ విమానాశ్రయాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల, రాజస్థాన్‌లోని జోథ్‌పూర్, బికనీర్, కిషన్‌గఢ్ విమానాశ్రయాలు, గుజరాత్‌లోని భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, ఉత్తరప్రదేశ్‌లోని హిండన్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియార్ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటి మూసివేయడంతో విమానయాన సంస్థలు భారీ సంఖ్యలో సర్వీసులను రద్దు చేశాయి. ఈ నెల 10 వరకూ 165 పైగా సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. అలాగే పలు సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా, స్సైస్‌జెట్ సంస్థలు కూడా తెలిపాయి. కాగా, అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాలకు చెందిన విమానయాన సంస్థలు మంగళవారం రాత్రి నుంచే భారత్‌కు కొన్ని సర్వీసులను రద్దు చేశాయి. లేదా దారి మళ్లించాయి.