- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రయివేట్ స్కూళ్లపై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.
- Advertisement -