- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆక్రమణదారులపై కేసు నమోదుచేసి, వేగవంతమైన విచారణతో సత్వర చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న హైడ్రా పోలీస్ స్టేషన్ గురువారం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైడ్రా ఆధ్వర్యంలో ఠాణా అందుబాటులోకి రానున్నట్టు కమిషనర్ ఏ.వి.రంగనాథ్ వెల్లడించారు. రాణిగంజ్‌లోని బుద్ధభవన్ పక్కనున్న జీ+2 భవనంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ఎస్‌హెచ్‌ఓగా ఏసీపీ పి.తిరుమల్ నియమితులయ్యారని, మరో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12మంది ఎస్సైలు, 30మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నట్టు వివరించారు.
- Advertisement -