- Advertisement -
గండాల సుడిగుండాలతో
చక్ర భ్రమణం చేసిన
చక్రవర్తి వాడు –
తుఫాను దెబ్బల తాకిడికి
తట్టుకుని పులి పంజా విసిరినట్లు
వలవిసిరి
సిరిసంపదలు సష్టిస్తున్న
మొనగాడు వాడు –
సముద్రం వాడి ప్రాణ నేస్తం
ఉదయకిరణాలతో పోటీపడుతూ
పడవ పల్లకిలో
ప్రయాణం చేస్తున్న
వాస్కోడాగామా వాడు –
ఆటుపోట్లతో
కాటు వేస్తున్న సముద్రంతో
రోజు కుస్తీ పడుతూ
చతురత గలిగిన
వేటగాడు వాడు –
నిర్జన ద్వీపంలో చిక్కుకున్నా
తన మనోధైర్యంతో
సాహసాన్ని ప్రదర్శిస్తూ
తనని తాను రక్షించుకునే
సాహస వీరుడు
రాబిన్సన్ క్రూసో కూడా వాడే –
నేటి యువతరానికి
వెలుగు బాట చూపు
దారి దీపమన్నది
నిజమన్నది
నిజమే కదా…
-డా|| కొరుప్రోలు హరనాథ్, 9703542598
- Advertisement -