Thursday, May 8, 2025
Homeతాజా వార్తలుపాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్‌..మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం

పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్‌..మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్‌కాల్‌ రావడం కలకలం రేపింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్‌ కుమార్‌ స్థానికంగా గాజుల వ్యాపారం చేస్తుంటారు. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తుండగా 92 32925 27504 నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ‘మీరు ఏం చేస్తున్నారో.. మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై త్రిలోక్‌ కుమార్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. సీఐ రామ్‌కిషోర్‌ స్పందిస్తూ.. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌చేసి మాట్లాడినట్లు తెలుస్తోందని, దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -