Sunday, September 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన చికెన్ ధరలు..

భారీగా పెరిగిన చికెన్ ధరలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ లో మాంసం తినేవారికి ఊహించని షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటి వరకు శ్రావణమాసం అలాగే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో చికెన్ కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు జనాలు. కానీ ఇప్పుడు దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వారానికి 20 రూపాయల చొప్పున… కిలో చికెన్ ధర పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని… విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూర్పుగోదావరి తదితర నగరాలలో స్కిన్లెస్ కేజీ చికెన్ 230 నుంచి 240 వరకు విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో 280 చికెన్ ధర ఉంది. అత్యల్పంగా కాకినాడలో 225 నుంచి 230 రూపాయల వరకు పలుకుతోంది. హైదరాబాద్ లాంటి మహానగరాలలో కిలో చికెన్ 240 రూపాయలు ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -